రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం

*కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర

Update: 2022-09-07 13:00 GMT

రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం 

Bharat Jodo Yatra: పార్టీకి జవసత్వాలు తేవడానికి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పర్ఫామెన్స్ పెంచడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో అంటూ భారీ ఎత్తున పాదయాత్ర చేపడుతున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్రను తలపెట్టారు. 150 రోజులపాటు ఈ భారీ యాత్ర జరుగుతుంది. హోటళ్లలో స్టే చేయడం కాకుండా యాత్ర పొడవునా రహదారిని ఆనుకునే కాంగ్రెస్ నేతలంతా బస చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 60 భారీ కంటెయినర్లను సిద్ధంగా ఉంచారు. ఈ కంటెయినర్లలోనే అన్ని ఏర్పాట్లూ చేశారు. యాత్ర జరుగుతున్న దారిలో బస చేసిన ప్రదేశాల్లో కంటెయినర్లతో తాత్కాలిక గ్రామాలు కొలువు దీరతాయని నేతలు అంటున్నారు. ఐదు నెలల పాటు జరిగే ఈ పాదయాత్రతో దేశమంతా ఎన్డీయేకు బలమైన శక్తిగా యూపీఏ శ్రేణుల్ని సన్నద్ధం చేసేలా సీనియర్లు ప్లాన్ చేశారు.

ఇక యాత్ర ప్రతిరోజూ 6 నుంచి 7 గంటలపాటు దాదాపు 22, 23 కిలోమీటర్ల మేర జరుగుతుంది. ఉదయం పాదయాత్ర చేసేందుకు సెపరేట్ గా ఒక బ్యాచ్ సాయంత్రం కోసం వేరే బ్యాచ్ లను రూపొందించారు. సాయంత్రం పాదయాత్రల్లోనే భారీ మీటింగ్ లకు రూపకల్పన చేశారు. రాహుల్ గాంధీ స్పీచ్ కూడా సాయంత్రపు పాదయాత్రల్లో భాగంగానే ఉంటుందని నేతలు చెబుతున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరిగే ఈ పాదయాత్ర దేశంలోని 20 ముఖ్యమైన పట్టణాలను తాకుతూ సాగుతుంది. తిరువనంతపురం, కొచ్చి, నీలాంబుర్, మైసూరు, బళ్లారి, రాయిచూర్, వికారాబాద్, నాందేడ్, జల్గావ్, ఇండోర్, కోటా, దౌసా, ఆల్వార్, బులంద్‎షహర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్ కోట్, జమ్మూ మీదుగా శ్రీనగర్ లో ముగుస్తుంది.

2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఈ క్రమంలో సీనియర్లంతా పార్టీకి గుడ్ బై చెబుతూ కేడర్లో నైరాశ్యానికి కారణమవుతున్నారు. అటు పార్టీ పగ్గాలు కూడా గాంధీయేతర ఫ్యామిలీకి అప్పజెప్పాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గులాం నబీ ఆజాద్ వంటి సీనియర్లు పార్టీ వీడిన తరువాత రాహుల్ పాదయాత్ర చేస్తుండడం ఆసక్తి రేపుతోంది. తనకు అధికారం అక్కర్లేదని, పార్టీ కన్నా దేశం ఇంకా ముఖ్యమని రాహుల్ అంటున్నారు. రాజీవ్ గాంధీ తుదిశ్వాస విడిచిన శ్రీపెరంబుదూర్ నుంచి ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు రాహుల్. 

Tags:    

Similar News