Congress: లక్నో విమానాశ్రయంలో హైడ్రామా
Congress: లక్నో ఎయిర్‌పోర్టులో హైడ్రామా చోటు చేసుకుంది. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డం పడినట్టుగా తయారైంది రాహుల్ గాంధీ లఖీంపూర్ పర్యటన.
Congress: లక్నో ఎయిర్‌పోర్టులో హైడ్రామా చోటు చేసుకుంది. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డం పడినట్టుగా తయారైంది రాహుల్ గాంధీ లఖీంపూర్ పర్యటన. తీవ్ర ఉద్రిక్తతల నడుమ సొంత వాహనంలోనే లఖీం పూర్‌కు బయలుదేరింది రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యులు కాంగ్రెస్ బృందం. ప్రభుత్వ ఎస్కార్ట్ లేకుండానే వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలోనే లకీంపూర్ వెళ్లారు. అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. మరోవైపు నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.
అంతకుముందు లక్నో ఎయిర్‌పోర్టులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. లఖీంపూర్‌ఖేరి ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం మధ్యాహ్నం లక్నో ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఘటనా స్థలానికి వెళ్లాలని భావించింది. ఇందుకు గానూ యూపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే లక్నో ఎయిర్ పోర్టుకు రాగానే అనుమతి లేదంటూ పోలీసులు మాత్రం అడ్డుతగిలారు. శాంతి భద్రతల సమస్య వస్తుందని ఆయన్ను అక్కడే అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలు తమ సొంత వాహనంలోనే వెళ్తామని తేల్చి చెప్పడంతో పరిస్థితి చేయి దాటింది. దాంతో రాహుల్ ఎయిర్ పోర్టులోనే నిరసనకు దిగారు. పోలీసులకు రాహుల్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
మొత్తానికి చాలా సేపటి తర్వాత కాంగ్రెస్ నేతలు సొంత వాహనంలోనే లఖీంపూర్ వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శించారు. దాంతో రాహుల్ గాంధీతో పాటు ఐదుగురు సభ్యుల బృందం లఖీంపూర్ వెళ్లారు. అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియంకగాంధీకి కూడా అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇద్దరు కలిసి లఖీంపూర్ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్టు తెలుస్తోంది.