Rahul Gandhi: ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఫైర్‌

Rahul Gandhi: దేశం నుంచి గ్లోబల్‌ కంపెనీలు వెళ్లిపోతున్నాయని ఆరోపణలు

Update: 2022-04-27 11:30 GMT

ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఫైర్‌

Rahul Gandhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ నిప్పులు చెరిగారు. దేశం నుంచి పలు గ్లోబల్ కంపెనీలు వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. హేట్‌ ఇన్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా కలిసి ఉండలేవన్నారు. దేశంలో దారుణంగా మారిన నిరుద్యోగ సమస్య నెలకొందని ఈ విషయం మోదీ దృష్టిసారించాలని రాహుల్‌ హితవు పలికారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత 2017 నుంచి 7 గ్లోబల్‌ బ్రాండ్‌ కంపెనీలు దేశం నుంచి వెళ్లిపోయాయన్నారు. 9 పరిశ్రమలు మూతపడ్డాయని 649 డీలర్‌షిప్‌లను భారత్‌ కోల్పోయిందని విమర్శలు గుప్పించారు. ఆయా కంపెనీలు వెళ్లిపోవడంతో ప్రత్యక్షంగా 84వేల మంది ఉద్యోగాలను కోల్పోయినట్టు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.

ఇప్పటివరకు దేశం నుంచి వెళ్లిపోయిన కంపెనీల వివరాలను రాహుల్‌గాంధీ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. మోదీ అధికారం చేపట్టిన తరువాత 2017లో చెవ్రోలెట్‌, 2018లో మన్‌ ట్రక్స్‌, 2019లో ఫియట్‌, యునైటెడ్‌ మోటార్స్‌, 2020లో హార్లీ డేవిడ్సన్‌, 2021లో ఫోర్డ్‌, 2022లో డట్సున్‌ వెళ్లిపోయాయని రాహుల్‌ వివరించారు. మోదీజీ, హేట్‌ ఇన్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా రెండు కలిసి ఉండలేవని నిరుద్యోగంపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని రాహుల్‌ స్పష్టం చేశారు. ఇటీవల రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు నిరుద్యోగం సమస్యపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. నిరుద్యోగం దేశాన్ని పట్టి పీడిస్తోందని ఈ సమస్యను పరిష‌్కరించకుండా మత ఘర్షణలను తెరపైకి తెస్తున్నారని విమర్శలు గుప్పస్తున్నారు. 

Tags:    

Similar News