Rahul Gandhi: అధికారం మోడీ చేతిలో లేదు.. మరెవరో వ్యక్తుల చేతుల్లో ఉంది
Rahul Gandhi: నేను భయపడే వ్యక్తిని కాదు.. పోరాడే వ్యక్తిని
Rahul Gandhi: ఢిల్లీలో విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కలకలం సృష్టిస్తోంది. ఫోన్లు హ్యాక్ అయినట్లు యాపిల్ నుంచి మెసేజ్ రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కేసీ వేణుగోపాల్, శశిథరూర్, పవన్‌ఖేర, చతుర్వేది, అఖీలేష్, సుప్రియ, మొయిత్ర, ఏచూరి, రాఘవ చద్దాకు మెయిల్ రావడంతో.. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్‌పై రాహుల్ గాంధీ మండిపడ్డారు. విపక్షాల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని.. ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు యాపిల్ కంపెనీ నుంచి మెసేజ్ వచ్చిందని.. ఫోన్ ట్యాపింగ్‌లకు భయపడేది లేదన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేసినా ఇబ్బంది లేదన్న రాహుల్.. తాను భయపడే వ్యక్తిని కాదని.. పోరాడే వ్యక్తినన్నారు. అధికారం మోడీ చేతిలో లేదన్న రాహుల్.. మరెవరో వ్యక్తుల చేతుల్లో ఉందన్నారు.