దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కోళ్లు, ఎడ్ల పందేలు ఊపందుకున్నాయి. తమిళ సంస్కృతిలో భాగమైన జల్లికట్టు పోటీలు మదురై జిల్లా అవన్యపురంలో ఘనంగా ప్రారంభమైయ్యాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, డీఎంకే నేత, నటుడు ఉదయనిధి స్టాలిన్ పాల్గొని ఆరంభ వేడుకలను వీక్షించారు. ఈ సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ జల్లికట్టు వేడుకల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నడూ లేని విధంగా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఏకంగా జాతీయ పార్టీ నేతలు క్యూ కట్టారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఇప్పటి నుంచే తమిళ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఏ చోటా, మోటా లీడర్లో కాదు నేరుగా అధ్యక్ష స్థాయి నేతలే రంగంలోకి దిగారు.