చైనా అంబాసిడర్ తో కనిపించిన రాహుల్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఎవరితో ఉన్నారంటూ ప్రశ్నలతో ట్వీట్లు
Rahul Gandhi: నేపాల్ టూర్‌లో ఉన్న రాహుల్‌గాంధీ ఖాట్మండు నైట్ క్లబ్‌లో ప్రత్యేక్షమయ్యారు. యూరప్‌తో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధాని మోడీ యూరప్ ట్రిప్ లో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లారు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇబ్బందుల్లో ఉన్న పార్టీని వదిలి.. విదేశాల్లో పార్టీ చేసుకుంటున్నారని కామెంట్లు వస్తున్నాయి. నేపాల్‌లోని చైనా అంబాసిడర్‌తో కలిసి పార్టీ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
పైగా రాహుల్ గాంధీ నేపాల్ టూర్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అతను ఖాట్మండులోని నైట్‌క్లబ్‌లో కనిపించాడు. దీంతో కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై బీజేపీ దాడి చేయడం మొదలుపెట్టింది. అయితే మయన్మార్‌లో నేపాల్ రాయబారిగా పనిచేసిన భీమ్ ఉదాస్.. తన కుమార్తె వివాహానికి రాహుల్‌ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఆ వివాహానికి హాజరయ్యేందుకే రాహుల్ నేపాల్ వెళ్లినట్టు సమాచారం.
రాహుల్ గాంధీ చేస్తున్నది ఆయన వ్యక్తిగత విషయమని బీజేపీ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా అన్నారు. కానీ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో హింస జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ నైట్ క్లబ్బుల్లో ఎంజాయ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీ, వెకేషన్, పార్టీ, హాలిడే, ప్లెజర్ ట్రిప్, ప్రైవేట్ ఫారిన్ విజిట్ తదితర వీడియోలను షేర్ చేస్తూ విరుచుకుపడ్డారు.
మరోవైపు బీజేపీ నేత కపిల్ మిశ్రా ట్వీట్ చేస్తూ ఇది రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కాదు. రాహుల్ గాంధీ ఎవరితో ఉన్నారని ప్రశ్నించారు. చైనాలో ఏజెంట్లు ఉన్నారా? సైన్యానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ చైనా ఒత్తిడి వల్లేనా? ఇలాంటి ప్రశ్నలు తలెత్తున్నాయి.
రాహుల్ గాంధీ నేపాల్ టూర్‌పై బీజేపీ విమర్శల నేపథ్యంలో ఘాటుగా స్పందించింది కాంగ్రెస్. స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ నేపాల్ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా అండగా నిలిచారు. వివాహ వేడుకలకు హాజరుకావడం నేరమా, చట్టవిరుద్ధమా అని ప్రశ్నించారు. స్నేహం చేయడం నేరమని బీజేపీ నిర్ణయించిందేమో' అని ట్వీట్ చేశారు.