చింతన్ శిబిరంలో రాహుల్ ఆసక్తికర ప్రసంగం
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత బలపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ.
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత బలపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ. ఉదయ్ పూర్ చింతన్ శిబిరంలో 20 కీలక ప్రతిపాదనలకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపిందని తెలిపారు. ముఖ్యంగా ఒకే కుటుంబానికి ఒకే టికెట్ ఇవ్వడంతోపాటు దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ ఎస్ హయాంలో దేశంలో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందన్న ఆయన కాంగ్రెస్ పార్టీతోనే కొన్ని పనులు సాధ్యమన్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు పార్టీ నేతలందరూ ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ.
దేశంలో జరుగుతున్న అరాచకాలపై మాట్లాడేందుకు నేను ఏమాత్రం భయపడబోమన్నారు రాహుల్ గాంధీ ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ లో మాట్లాడిన ఆయన తన ప్రసంగంలో కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ వంటి శక్తులు దేశంలో చేస్తున్న అరాచకాలపై మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున ఆ బాధ్యతలుతాను తీసుకుంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్లి వారు చేసే అరాచకాలు, ఇతర విధ్వంసాలను ప్రజలకు వివరించాలన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నేతల బాధ్యతన్నారు.