Rahul Gandhi Accused The Modi Government: మోడీజీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి : రాహుల్ గాంధీ
Rahul Gandhi Accused The Modi Government: గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని కేంద్రం పైన విమర్శలు
Rahul Gandhi Accused The Modi Government: గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని కేంద్రం పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తాజాగా అయన మరోసారి ప్రధాని మోడీ పైన విమర్శలు చేశారు.. ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అప్పుడు ఇచ్చిన మాటను ప్రధాని మోడీ పక్కన పెట్టేశారని అభిప్రాయపడ్డారు రాహుల్..
ఆదివారం 'రోజ్‌గర్ దో' (ఉపాధి కల్పించు) ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలపై విరుచుకపడ్డారు.. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, లాక్‌డౌన్ విధించడం... ఈ మూడు భారత ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీశాయని రాహుల్ గాంధీ అన్నారు. వాస్తవం ఏమిటంటే మోదీ ప్రభుత్వ విధానాల వల్ల 14 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారని రాహుల్ అభిప్రాయపడ్డారు.. ఇందుకు సంబంధించి 'రోజ్‌గార్ దో' (ఉద్యోగాలు ఇవ్వండి) పేరుతో వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ..
देश के युवाओं के मन की बात:
— Rahul Gandhi (@RahulGandhi) August 9, 2020
रोज़गार दो, मोदी सरकार!
आप भी अपनी आवाज़ युवा कॉंग्रेस के #RozgarDo के साथ जोड़कर, सरकार को नींद से जगाइये।
ये देश के भविष्य का सवाल है। pic.twitter.com/zOt6ng2T0M
రోజ్‌గార్ దో పేరుతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాన్ని ఆయన కోరారు. యూత్ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాహుల్ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రోజ్‌గార్ దో ఉద్యమానికి మద్దతు తెలుపుతూ యువశక్తే మన బలమని వాఖ్యానించారు. ఇక రాహుల్ గాంధీ ఈ పోస్ట్ చేసిన అనంతరం అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా కేంద్రాన్ని ప్రశ్నిస్తూ వీడియోని పోస్ట్ చేశారు.