Punjab Elections 2022: కాంగ్రెస్ టికెట్ నిరాకరణ.. స్వతంత్రంగా పోటీకి దిగిన సీఎం సోదరుడు
Punjab Elections 2022: పంజాబ్ పోరుపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నాయి.
Punjab Elections 2022: పంజాబ్ పోరుపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నాయి. టికెట్ దక్కకుంటే మిగతా పార్టీల వైపు వెళుతున్నారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ వ్యవహారం రచ్చకు దారితీసింది. తాజాగా పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ సోదరుడు మనోహర్ సింగ్కు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని నిర్ణయించారు.
మనోహర్ సింగ్ బస్సీ పఠానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని భావించారు. అయితే ఒక కుటుంబం, ఒకే టికెట్ విధానాన్ని అనుసరిస్తున్న కాంగ్రెస్ ఆ కారణంతో మనోహర్కు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్కు కేటాయిస్తూ శనివారం అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. దీంతో ఆయన ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని నిర్ణయించారు. 2007లోనూ మనోహర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.