Pulwama Type Attack Averted : పుల్వామా తరహా ఉగ్రదాడికి కుట్ర? 52 కిలోల పేలుడు పదార్థాల స్వాధీనం

గతేడాది పుల్వామాలో జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే అదే తరహా దాడిని ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్టు ఆర్మీ అనుమానిస్తోంది. అందుకు..

Update: 2020-09-18 02:39 GMT

గతేడాది పుల్వామాలో జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే అదే తరహా దాడిని ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్టు ఆర్మీ అనుమానిస్తోంది. అందుకు కారణం భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు దొరకడమే.. జమ్మూ కాశ్మీర్‌లోని హైవే సమీపంలో గురువారం సైన్యం 52 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాల సహాయంతో ఉగ్రవాదులు సైన్యంపై పుల్వామా లాంటి దాడికి ప్రణాళికలు వేశారనే అనుమానం కలుగుతోంది. గురువారం ఉదయం 8 గంటలకు కాశ్మీర్‌లోని కెర్వాలో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా సింటాక్స్ ట్యాంక్ బయటపడిందని, అక్కడ మొత్తం 52 కిలోల పేలుడు పదార్థాలు లభించాయని సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ట్యాంక్ నుంచి 416 ప్యాకెట్ల పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఒక్కొక్క దానిలో 125 గ్రాముల పేలుడు పదార్థాలు ఉన్నాయి.

దీనిపై ఉగ్రవాదుల హస్తం ఉందని ఆర్మీ భావిస్తోంది. పేలుడు పదార్థాలు దొరికిన ప్రదేశం హైవేకి చాలా దగ్గరగా ఉంది.. అంతేకాకుండా పుల్వామా దాడి జరిగిన ప్రదేశానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పేలుడు పదార్థాలు దొరికాయి. కాగా గత ఏడాది ఫిబ్రవరి 14న జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి ఘటనలో 40 మందికి పైగా సైనికుల అమరవీరులయ్యారు. దీంతో భారత్ కూడా ఇందుకు ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ లోని బాలకోట్ లోని జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద శిక్షణా కేంద్రంపై భారత వైమానిక దళం దాడి చేసింది.. దాదాపు 200 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. 

Tags:    

Similar News