Puducherry: పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ సర్కార్
Puducherry: బలనిరూపణలో నారాయణస్వామి సర్కార్ విఫలం అీయ్యారు.
Puducherry: పుదుచ్చేరిలో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలింది. బలనిరూపణలో నారాయణస్వామి ప్రభుత్వం పూర్తిగా విఫలమైయింది. దీంతో నారాయణ స్వామి రాజీనామా లేఖతో రాజ్‌భవన్‌కు బయల్దేరారు. గవర్నర్ కు తన రాజీనామా సమర్పించనున్నారు. నారాయణస్వామి సర్కార్ గట్టెక్కాలంటే 14 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ అధికార కాంగ్రెస్ కూటమి బలం 12కి తగ్గింది. ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు సహా 33 మంది సభ్యులున్న పుదుచ్చేరి శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల అనంతరం 26 మంది ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ నుంచి 10(స్పీకర్‌తో కలిపి), డీఎంకే నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు.
మరోవైపు విపక్ష పార్టీ అయిన ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్(AINRC) కూటమి బలం 14(ఎన్‌ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు)గా ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాతో పుదుచ్చేరి రాజకీయాలు మారిపోయాయి. కిరణ్‌బేడీని లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తప్పించి.. తమిళసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తమిళసై ఎల్జీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నారాయణస్వామి ప్రభుత్వాన్ని సోమవారం శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.