భారత్‌లో పబ్జీ గేమ్‌కు ఎండ్‌ కార్డ్‌

Update: 2020-10-30 11:34 GMT

పబ్జీ గేమ్‌కు ఎండ్‌ కార్డు పడింది. ఇక నుంచి ఈ ఆటను ఆడలేరు. శుక్రవారం నుంచి పబ్జీ భారత సర్వర్లను నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. దీంతో ప్రస్తుతమున్న పబ్జీ యూజర్లకు ఇక నుంచి ఆడే అవకాశం ఉండదు. భారత ప్రభుత్వం నిషేధం విధించిన దాదాపు రెండు నెలల తర్వాత పబ్జీ తన సేవలను పూర్తిగా నిలిపివేసింది.

పబ్జీ సహా 116 మొబైల్‌ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో నిషేధం విధించింది. దీంతో సెప్టెంబర్‌ 2 నుంచి పబ్జీ కొత్త డౌన్‌లోడ్‌లు నిలిచిపోయాయి. అయితే నిషేధానికి ముందే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నవారికి మాత్రం ఇన్నాళ్లు గేమ్‌ ఆడే అవకాశం లభించింది. తాజాగా సర్వర్లను నిలిపివేయడంతో ఇకపై వారికి కూడా యాప్‌ పనిచేయదు. ఈ మేరకు పబ్జీ మొబైల్‌ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. 

Tags:    

Similar News