వ్యవసాయ చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్నా మోదీ సర్కార్ వాటిని ఎందుకు రద్దు చేయడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. బిజ్నోర్‌లో కిసాన్ పంచాయత్ సభలో పాల్గొన్న ప్రియాంకా రైతులకు ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రైతులు, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రధాని మోడీ వాగ్దానాలు గుప్పించినా ఏమీ జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు తమకు అవసరం లేదని రైతులు తేల్చిచెబుతున్నా ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.