Priyanka Gandhi: యూపీ సీఎం అభ్యర్థిపై ప్రియాంక గాంధీ స్పష్టత
Priyanka Gandhi: నిన్న యూపీ కాంగ్రెస సీఎం అభ్యర్థిని తానేనని హింట్
Priyanka Gandhi: యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ స్పష్టత నిచ్చారు. యూపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు. పదే పదే అదే ప్రశ్న అడగడంతోనే తాను నిన్న అలా స్పందించినట్టు ప్రియాంక స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయని.. ఆయా పార్టీలను ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని అడగడం లేదని.. కేవలం తనను మాత్రమే మళ్లీ మళ్లీ ఎందుకు అడుగుతున్నారని ప్రియాంక ప్రశ్నించారు.
ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిన్న పార్టీ అగ్రనేత, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంకా గాంధీ యూపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రియాంక స్పందించారు. యూపీలో తాను కాకుండా మరెవరైనా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. దాంతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని తానేనని ప్రియాంక హింట్ ఇవ్వడంతో జోరుగా చర్చ జరిగింది.