PM Modi Video Conference: స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రధాని మోదీ సమావేశం
PM Modi Video Conference: వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వారణాసి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సమావేశం అయ్యారు.
PM Modi Video Conference: వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వారణాసి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సమావేశం అయ్యారు. కరోనా కష్టకాలంలో వివిధ సంస్థలు చేసిన సామాజిక పనుల గురించి ప్రధానమంత్రికి సమాచారం ఇచ్చాయి. ఈ సందర్బంగా కరోనా కాలంలో ప్రజలకు సహాయం చేయడానికి కేంద్రం తీసుకున్న చర్యలను మోడీ వివరించారు. కరోనాను నియంత్రించడానికి యుపిలో యోగి ప్రభుత్వం చేసిన కృషిని మోడీ ప్రశంసించారు.
మోదీ మాట్లాడుతూ.. వంద సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన అంటువ్యాధి వచ్చిందని. అప్పుడు భారతదేశంలో అంత జనాభా లేదని అన్నారు. కానీ ఆ సమయంలో కూడా, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారతదేశం ఉందని అన్నారు. ఈసారి కూడా భారతదేశంలో అదే పరిస్థితి ఉందని.. ప్రజల సహకారం అన్ని భయాలను నాశనం చేసిందని అన్నారు. బ్రెజిల్‌లో ఉత్తరప్రదేశ్ లో ఉన్నంత జనాభా ఉంది.. కానీ అక్కడ 65 వేలకు పైగా ప్రజలు మరణించారు. కానీ ఉత్తర ప్రదేశ్ లో సంక్రమణ వేగాన్ని నియంత్రించడమే కాదు, కరోనా ఉన్నవారు కూడా వేగంగా కోలుకుంటున్నారని అన్నారు.
ఈ కష్టకాలంలో సామాన్యుల బాధలను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తుందని.. అందులో భాగంగా పేదలకు తగినంత రేషన్ లభిస్తుందని, ఉపాధి ఉంటుందని అన్నారు. 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ ఇస్తున్నామన్నారు. కాశీ ప్రజలు కూడా దీనివల్ల లబ్ధి పొందుతున్నారని అన్నారు.
కాగా లాక్డౌన్ సమయంలో అవసరమైన వారికి ఆహారం అందించడంలో మోడీ సమావేశమైన సంస్థలు జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాయి. వివిధ ప్రాంతాల నుండి 100 కు పైగా సంస్థలు లాక్డౌన్ కాలంలో వారి స్థాయి మేర సహాయం చేశారు. వారణాసిలో ఫుడ్ సెల్ ద్వారా 20 లక్షల ఆహార ప్యాకెట్లు, 2 లక్షల రేషన్ కిట్లను పంపిణీ చేశాయి. ఆహార పంపిణీతో పాటు, ఈ సంస్థలు శానిటైజర్, మాస్కుల పంపిణీ వంటి ఇతర సామాజిక కార్యక్రమాలను కూడా చేశాయి. వీరందరినీ కరోనా వారియర్స్ గా జిల్లా యంత్రాంగం సత్కరించింది.