ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడనున్న ప్రధాని మోడీ
భారతీయ విద్యార్థుల తరలింపుపై జెలెన్‌స్కీతో చర్చలు
Narendra Modi: ప్రధాని మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడనున్నారు. భారతీయ విద్యార్థుల తరలింపుపై జెలెన్‌స్కీతో చర్చించనున్నారు. రష్యా చమురు ఎగుమతులపై అమెరికా, ఈయూ నిషేధం విధించాయి. దక్షిణకొరియా కూడా రష్యా సెంట్రల్ బ్యాంక్‌తో లావాదేవీలు నిలిపివేసింది. ఇక రెండు దేశాల వార్‌తో ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగాయి. 13 సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నాయి ముడిచమురు ధరలు. బ్యారెల్ క్రూడాయిల్ ధర 129 డాలర్లకు చేరుకుంది.
ఉక్రెయిన్‌పై రష్యా సంచలన ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్ ఖార్కీవ్ అణు రియాక్టర్‌ను పేల్చుకుని రష్యాపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తుందని పుతిన్ ఆరోపిస్తున్నారు. ఇక సిరియా దళాలను రష్యా రిక్రూట్ చేసుకుటుందని కథనాలు వస్తున్నాయి.