Narendra Modi: కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోడీ సమీక్ష

* ఒమ్రికాన్‌పై ప్రధాని మోడీకి వివరించిన అధికారులు * కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోడీ

Update: 2021-11-27 10:30 GMT

కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోడీ సమీక్ష(ఫైల్ ఫోటో)

Narendra Modi: ప్రపంచ దేశాలను కోవిడ్ నయా వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది. ఈ నేపధ్యంలో ఈ వేరియంట్ విజృంభణ, వ్యాక్సినేషన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను కరోనా వేరియంట్‌ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒమిక్రాన్‌ను దేశంలోకి రాకుండా కట్టడి చేసే విధంగా సుధీర్గ చర్యలు నిర్వహించారు. ఇదే సమయంలో అధికారులకు పలు సలహాలు, సూచనలిచ్చారు.

మరోవైపు దక్షఇణాఫ్రికా వేరియంట్‌పై రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేయాలని అధికారులకు ప్రధాని సూచించారు. అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లా స్థాయిలో కరోనా న్యూ వేరియంట్‌పై అవగాహన కల్పించాలన్నారు.

అదేవిధంగా కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నిబంధనలు పాటించేలా నిరంతర నిఘాను కొనసాగించాలన్నారు. ఇదే సమయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు నిబంధనల మేరకు పరీక్షలు చేయించుకున్నారా లేదా అనే విషయంలో గట్టి పర్యవేక్షణ అవసరమని చెప్పారు. కరోనా ఉధృతంగా ఉన్న దేశాలపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. 

Full View


Tags:    

Similar News