PM Modi Inaugrates Ultra Rewa Soloar Project: రేవాలోని అల్ట్రా మెగా సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని

PM Modi Inaugrates Ultra Rewa Soloar Project: మధ్యప్రదేశ్‌లోని రేవాలోని అల్ట్రా మెగా సోలార్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.

Update: 2020-07-10 07:30 GMT
PM Modi Inaugrates Rewa Solar Project

PM Modi Inaugrates Ultra Rewa Soloar Project: మధ్యప్రదేశ్‌లోని రేవాలోని అల్ట్రా మెగా సోలార్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్ రేవా అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 22 డిసెంబర్ 2017 న మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టుకు పునాది వేసింది. ప్రాజెక్టు ప్రారంభం సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు.. ఆసియాలో అతిపెద్ద అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అని అన్నారు. ఇది కేవలం రాష్ట్రానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి పరిశుభ్రమైన వాతావరణానికి పునాది అని అన్నారు. రేవాలో ఏర్పాటు చేసిన పెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టును 1590 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సైడ్ సోలార్ ప్లాంట్లలో ఒకటి. ఈ సౌర విద్యుత్ ప్లాంట్‌లో మొత్తం మూడు యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్ 250 మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రాజెక్టు నుండి వచ్చే విద్యుత్తులో 76 శాతం రాష్ట్ర విద్యుత్ నిర్వహణ సంస్థకు, 24% ఢిల్లీమెట్రోకు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ , ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రులు, ఎంపిలు, సహా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కనెక్ట్ అయ్యారు. అంతకుముందు శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం సమీక్ష సమావేశాన్ని నిర్వహించి అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు.


Tags:    

Similar News