PM Modi: సనాతన ధర్మాన్ని ఇండియా కూటమి అంతం చేయాలనుకుంటోంది
PM Modi: సనాతన ధర్మాన్ని ఆచరించేవారు అప్రమత్తంగా ఉండాలి
PM Modi: మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, లోకమాణ్య తిలక్ లాంటి వారికి సనాతన ధర్మమే ప్రేరణగా నిలిచిందని, అలాంటి ధర్మాన్ని ఇండియా కూటమి నాశనం చేయాలని భావిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా సనాతన ఆచారాన్ని పాటించేవాళ్లు, ఈ దేశాన్ని ప్రేమించేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లోని బినాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడతూ ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నవారిని అడ్డుకోవాలని ప్రధాని మోడీ సూచించారు.