CPI Narayana: ముందస్తు ఎన్నికలు జరిపితే.. మోడీ ముందే ఇంటికి పోతాడు
CPI Narayana: ఒకే భాష, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే లీడర్ అన్నది వాళ్ల సిద్ధాంతమే
CPI Narayana: ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరగడంతోనే ప్రధాని మోడీ భయపడుతున్నాడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ముందస్తు ఎన్నికలు జరిపితే, మోడీ ముందే ఇంటికి పోతాడని ఎద్దేవా చేశారాయన.. ఇతర పార్టీల దృష్టిని మళ్లిచే ప్రయత్నం తప్పితే మరేదీ కాదని నారాయణ అన్నారు. లీకేజీలు ఇచ్చి, ప్రచారం చేసుకుని, దృష్టి మరలుస్తున్నారని విమర్శించారు. జీ - ట్వంటీ సమావేశాల పేరుతో కమలం గుర్తును ప్రచారం చేసుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నారాయణ... చంద్రమండలంలో రోవర్ దిగిన ప్రదేశానికి శివశక్తి అని పేరు పెట్టారని, వీలైన చోటల్లా మతాన్ని జోడించే ప్రయత్నాలు చేస్తున్నారని, రాజకీయంగా లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారని నారాయణ విమర్శించారు. ఇష్టానుసారంగా పేర్లు పెట్టుకోడానికి చంద్ర మండలం మన దేశం కాదన్నారాయన... ఒకే భాష, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే లీడర్ అన్నది వాళ్ల సిద్ధాంతమే నారాయణ చెప్పుకొచ్చారు.