బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా 12 చోట్ల బహిరంగసభల్లో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సభలు వర్చువల్ గా కాకుండా.. మోదీ అక్కడికి వెళ్లి స్వయంగా పాల్గొంటారు. అక్టోబర్ 23న ససారాం నుంచి మొదలవుతుంది. అన్ని ర్యాలీలలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా మిత్రపక్షాల నాయకులు హాజరుకానున్నారు. అక్టోబర్ 23 : ససారాం, గయా, భాగల్పూర్ అక్టోబర్ 28 : దర్భాంగా, ముజఫర్‌పూర్, పాట్నా (అదే రోజు, మొదటి దశలో 71 సీట్లకు ఓటింగ్).
నవంబర్ 1 : చప్రా, తూర్పు చంపారన్ , సమస్తిపూర్.. ఇక నవంబర్ 3 : వెస్ట్ చంపారన్, సహర్సా మరియు ఫర్బిస్గంజ్ (అదేరోజు 94 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి) లలో బహిరంగ సభలు జరుగుతాయి. ఇక ఎన్నికల ప్రచార సమయంలో మోదీ ప్రసంగం ఒకేసారి 100 ప్రదేశాలలో చూడటానికి ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేస్తారు. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.