PM Modi: భారత్ ఎప్పుడూ ప్రపంచాన్ని ఒకే కుటుంబంతో చూస్తుంది
PM Modi: కొవిడ్-19 గ్లోబల్ సమ్మిట్ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోడీ
PM Modi: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి ముప్పు ఇంకా తొలిగిపోలేదని ప్రధాని మోడీ అన్నారు. వాషింగ్ టన్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవిడ్-19 గ్లోబల్ సమ్మిట్ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన మోడీ వ్యాక్సిన్ సర్టిఫికెట్లను దేశాలు పరస్పరం గుర్తించడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని సరళతరం చేయాలని సూచించారు. భారత్ ఎప్పుడూ ప్రపంచాన్ని ఒకే కుటంబంగా చూస్తుందన్నారు. అనేక దేశాలకు తక్కువ ఖర్చుతో కూడిన ఔషదాలు, కిట్లు అందించామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ భారత్‌లో జరుగుతున్నట్లు ప్రధాని తెలిపారు. ఇప్పటివరకు 80 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు ప్రధాని మోడీ వివరించారు.