Indian Presidential Election 2022: రాష్ట్రపతి పదవి రేసులో NDA, UPA నువ్వా నేనా?
*సీనియర్ మోస్ట్ లీడర్ శరద్‌పవార్ వైపు కాంగ్రెస్ మొగ్గు
Indian Presidential Election 2022: రాష్ట్రపతి పదవిని రబ్బర్ స్టాంప్‌తో పోల్చేవారు. అయితే అది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు, పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ ఎన్నికైనా సరే పకడ్బందీ ఎత్తులు వేయడం, పట్టు నిరూపించుకోవడానికే అన్ని పార్టీలూ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ఎన్డీయే, యూపీఏ కూటములు రాష్ట్రపతి అభ్యర్థిగా తమ పార్టీ నుంచే ఎన్నిక కావాలని బలంగా కోరుకుంటున్నాయి.
ఈ క్రమంలో కాంగ్రెస్ కూటమి నుంచి మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ అయిన శరద్‌పవార్ పేరు వినిపిస్తుండగా బీజేపీ నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ తమిళిసై, అలాగే ఉత్తరాదికి చెందిన మరో సీనియర్ పొలిటీషియన్ అయిన గులాంనబీ ఆజాద్ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ రేసులో పలు ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్ పేరును కూడా ముందుకు తెస్తున్నట్టు ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.