విపక్షాలకు మరో ఎదురుదెబ్బ.. రాష్ట్రపతి రేసు నుంచి తప్పుకున్న గాంధీ మనవడు..
Presidential Elections 2022: రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై విపక్ష పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది.
Presidential Elections 2022: రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై విపక్ష పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రపతి పదవి రేసు నుంచి గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ తప్పుకున్నారు. ఉమ్మడి ప్రతిపక్షం తరపున తన పేరును అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విపక్షాల నుంచి నా కంటే మెరుగైన రాష్ట్రపతి అభ్యర్థిగా మరొకరి పేరును పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. ఇప్పటికే పోటీ చేయబోమని శరద్‌పవార్, ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థి ఖరారుపై రేపు మరోసారి విపక్ష పార్టీలు భేటీ కానున్నాయి.