Kargil Vijay Diwas: భారత జవాన్ల వీరోచిత పోరాటం.. కార్గిల్ విజయ్ దివస్‌కి 22 ఏళ్ళు

Kargil Vijay Diwas: కార్గిల్ యుద్ధం. పాకిస్థాన్‌ ఆర్మీపై భారత సైన్యం చేసిన వీరోచిత పోరాటమది.

Update: 2021-07-26 06:19 GMT

కార్గిల్ విజయ్ దివస్ లో పాల్గొన్న రాంనాథ్ కోవింద్ (ట్విట్టర్ ఇమేజ్)

Kargil Vijay Diwas: కార్గిల్ యుద్ధం. పాకిస్థాన్‌ ఆర్మీపై భారత సైన్యం చేసిన వీరోచిత పోరాటమది. పాక్‌ సైన్యాన్ని తరిమికొట్టిన సందర్భమది. ఆపరేషన్‌ విజయ్‌ విజయవంతమైన సమయమది. 1999 మే 3 నుంచి జూలై 26 వరకు సాగిన ఈ యుద్ధంలో పాక్‌ సైన్యం తోకముడించింది. చివరకు కార్గిల్‌ భూభాగాన్ని భారత్‌ కాపాడుకుంది. ఈ యుద్ధంలో పాకిస్థాన్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. 527 మంది భారత సైనికులు కూడా అమరులయ్యారు. వారి పోరాట పటిమనూ, త్యాగశీలతనూ స్మరించుకుంటూ ప్రతి ఏడాది భారత్‌.. జులై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకుంటోంది.

నేడు కార్గిల్‌లో విజయ్‌ దివాస్‌ కార్యక్రం జరుగనుంది. కార్గిల్‌ యుద్ధంలో అమరులైన సైనికులను తలుచుకుంటూ వారికి నివాళులు అర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ హాజరుకానున్నారు. నిజానికి ఆ రోజున కార్గిల్‌ను భారత్‌ పొగొట్టుకుంటే.. జమ్మూకశ్మీర్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో శాంతియుత పరిస్థితులు ఉండేవి కావన్నది వాస్తవం.

Full View


Tags:    

Similar News