President Election Results 2022: రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌కు ...విజేత ఎవరు..?
*దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరవుతారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది ...
President Election Results 2022: భారత కొత్త రాష్ట్రపతి ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. రాష్ట్రపతి పదవికి ఈ నెల 18న జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ పడ్డారు. మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభంకానుంది. అయితే భారత ప్రథమ పౌరురాలిగా తొలి ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లోకి అడుగుపెట్టడం ఇక లాంఛనమేనని తెలుస్తోంది.
రహస్య ఓటింగ్ విధానంలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటులో, వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ పోలింగ్‌లో అస్సాం, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 99 శాతం పోలింగ్ నమోదైంది. 4,796 మంది ఎలక్టోరల్ కాలేజీ ఓటర్లలో 771 మంది ఎంపీలు, 4వేల, 25 మంది ఎమ్మెల్యేలున్నారు.