పెరుగుతున్న ప్రీమెచ్యూర్ డెలివరీలు.. పరిశోధనల్లో బయటపడ్డ భయంకర నిజాలు...

Pollution: ఇండియాలోని ప్రముఖ నగరాల్లో నిర్వహించిన సర్వే...

Update: 2022-05-21 04:36 GMT

పెరుగుతున్న ప్రీమెచ్యూర్ డెలివరీలు.. పరిశోధనల్లో బయటపడ్డ భయంకర నిజాలు...

Pollution: వాయుకాలుష్యం అనేది దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని అందరూ అనుకుంటారు. కానీ తాజాగా గర్భిణులు, కడుపులోని బిడ్డలపై అంతకన్నా ఎక్కువ ప్రభావం చూపుతుందంటున్నారు వైద్య నిపుణులు. ఈ విషయాలను తాజాగా బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటి కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు సర్వే చేసి తేల్చారు. ఆ ప్రభావం పడుతున్న ప్రదేశాల్లో మన హైదరాబాద్ కూడా ఉందంటున్నారు నిపుణులు.

ఏదైనా కాయ... పిందె దశలోనే పండుగా మారితే ఎలా ఉంటుంది? అలాంటి కాయకు కాలం కలిసిరాలేదని.. అనతికాలంలోనే రాలిపోతుందని వేరే చెప్పక్కర్లేదు. అయితే ఈ పరిస్థితి ఈ మధ్య కాలంలో మానవ సంతతిలోనూ కనిపిస్తోంది. నెలలు నిండకముందే శిశువులు పుట్టి మరణించడం, నెలలు నిండక ముందే డెలివరీలు జరగడం వంటివి ఈ మధ్య కాలంలో ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి కారణాలేంటనే విషయంలో ప్రపంచ వైద్య నిపుణులు పలు అధ్యయనాలు నిర్వహించారు.

ఇండియాలోని ఎనిమిది నగరాల్లో ఓ సర్వే చేశారు. వాయు కాలుష్యం కారణంగా జరిగే అనార్ధలేమిటన్న అంశాలపై వారు స్టడీ చేస్తే.. ఆందోళన కలిగించే అంశాలు బయటపడ్డాయి. వాయు నాణ్యత గణనీయంగా క్షీణించడమే ప్రీ-మెచ్యూర్ డెలివరీలకు, శిశువుల మరణాలకు కారణమవుతుందని బర్మింగ్ హామ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‎కు చెందిన పరిశోధకుల బృందం తేల్చింది. మన దేశంలో జరిగిన అలాంటి మరణాల్లో 18 వేలతో ముంబయి మొదటి స్ధానంలో ఉండగా... బెంగళూరు 17వేల 5వందలు, కోల్ కతా 15వేలు, ఆ తర్వాతి స్ధానంలో హైదరాబాద్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

తాజా పరిశోధనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 37 వారాల కంటే ముందయ్యే డెలివరీలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా అవుతున్నాయని.. అందుకు ఇన్‎ఫెక్షన్లు, గర్భసంచి పెద్దదిగా అవ్వడం, యూరిటస్‎లో ఇబ్బందులు, స్మోకింగ్ చేసే ఆడవాళ్ళలో పిల్లలు చిన్నగా పుట్టడం, పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లోని గర్భిణుల్లో సమస్యలు తలెత్తడం.. ఇలా పలు అనారోగ్య సమస్యలతో ప్రి డెలివరీస్ అవుతున్నాయని చెబుతున్నారు.

కరోనా తర్వాత లేడీస్ కి సంబంధించి గైనిక్ సమస్యలు పెరిగాయని.. ఎయిర్ క్వాలిటీ తగ్గిపోతున్న హైదరాబాద్‎లో గర్భిణులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ లో అభివృద్ది జరుగుతున్న మాట వాస్తవమే అయినా... దాని వెనుక గల చీకటి కోణాలు గుర్తించాలంటున్నారు. కాలుష్యాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటే తప్ప పరిష్కారం దొరకదంటున్నారు.

Tags:    

Similar News