Prashant Kishore: ఇవాళ సోనియాగాంధీతో ప్రశాంత్ కిషోర్ భేటి
Prashant Kishore: కాంగ్రెస్‌లో చేరే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్న పీకే
Prashant Kishore: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖరారు అయినట్లే తెలుస్తోంది. ఈరోజు పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో జరిగే సమావేశంలో తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ కు ఆకర్షణీయమైన ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ ఆఫర్‌ను అంగీకరించే ముందు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఉద్ధవ్ థాకరే, కె.చందశేఖర్ రావు వంటి పలువురు ముఖ్యమంత్రులను కూడా సంప్రదించే అవకాశం లేకపోలేదు.
దేశ రాజకీయ రంగంలో కాంగ్రెస్ ప్రస్తుత స్థితిని, పార్టీ బలాలు, బలహీనతలపై ప్రత్యేక దృష్టి సారించారు ప్రశాంత్ కిషోర్. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ సవరించుకోవాల్సిన అంశాలను పార్టీ నేతల ముందుంచనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ తన నాయకత్వ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలి. కూటమి సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు మునపటి ఆదర్శాలకు తిరిగి రావాలి. అట్టడుగు కార్యకర్తలు, నాయకులతో కమ్యూనికేషన్ వ్యవస్థను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ప్రశాంత్ కిషోర్ సూచిస్తున్నారు.