పీకే చేతికి ఏకే 47.. పార్టీలో చేరకముందే రాజకీయ దుమారం..
Congress: కాంగ్రెస్ రాజకీయాల్లో యాక్టివ్ రోల్స్‌లోకి పీకే ఎంటరవుతున్నారు.
Congress: కాంగ్రెస్ రాజకీయాల్లో యాక్టివ్ రోల్స్‌లోకి పీకే ఎంటరవుతున్నారు. పీకే ఏం చేస్తారన్నదానిపై పార్టీలో ఉత్కంఠ రేగుతోంది. 4 రోజుల్లో మూడోసారి ముఖ్యులతో పీకే భేటీ అయ్యారు. పీకే పార్టీలో చేరకముందే రాజకీయంగా దుమారం రేగుతోంది. సీనియర్ల నుంచి సానుకూలత కన్పించడం లేదు. అయితే అదే సమయంలో పీకే చర్చల సమయంలో G23 నేతలను పార్టీ ఆహ్వానించకపోవడం సంచలనంగా మారుతోంది.
ఈ ఏడాది చివర్లో గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ మెయిన్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పీకే చేరికపై పార్టీలో భిన్నస్వరాలు విన్పిస్తున్నా అసంతృప్తులను పట్టించుకోవద్దని సోనియా గాంధీ నిర్ణయించారని అందుకే ఈసారి పీకే విషయంలో క్లియర్ స్టాండ్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏమైనా చేయండి పార్టీని బాగుచేయండంటూ పీకేకు సోనియా క్లియర్ ఇండికేషన్ ఇచ్చినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. పీకేతో చర్చల సందర్భంగా సోనియా ఫుల్ క్లారిటీతో అడుగులేస్తున్నారు. సీనియర్లను సముదాయిస్తూనే పార్టీ ఇప్పటికే ఎంతో నష్టపోయిందని ఎవరైనా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే ఇకే వేటు తప్పదంటూ క్లారిటీ ఇచ్చేస్తున్నారు.