Wagah Border: పాకిస్తాన్‌లో చిక్కుకున్న తెలుగు యువకుడు ప్రశాంత్ విడుదల

Wagah Border: 2017లో విదేశాల్లో ఉన్న ప్రియురాలిని కలిసేందుకు వెళ్లి.. దురదృష్టవశాత్తు పాకిస్థాన్ చిక్కుకున్న తెలుగు యువకుడు ప్రశాంత్‌ విడుదల అయ్యాడు.

Update: 2021-06-01 10:52 GMT

Wagah Border: పాకిస్తాన్‌లో చిక్కుకున్న తెలుగు యువకుడు ప్రశాంత్ విడుదల

Wagah Border: 2017లో విదేశాల్లో ఉన్న ప్రియురాలిని కలిసేందుకు వెళ్లి.. దురదృష్టవశాత్తు పాకిస్థాన్ చిక్కుకున్న తెలుగు యువకుడు ప్రశాంత్‌ విడుదల అయ్యాడు. ఇవాళ హైదరాబాద్‌ చేరుకోనున్నారు. వాఘా సరిహద్దులో భారత్ అధికారులకు ప్రశాంత్‌ను అప్పగించారు. ప్రశాంత్ హైదరాబాద్‌లోని ఓ సాప్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రశాంత్ ఇంటికి వస్తుండడంతో కుటుంబ సభ్యలు ఆనందంతో ఉన్నారు.

2019లో తన కుమారుడిని రప్పించే ప్రయత్నం చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను ప్రశాంత్ తండ్రి బాబురావు కలిశాడు. ఇక ప్రశాంత్‌ విడుదలతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాక్ నుంచి ప్రశాంత్ తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉందని అతని సోదరుడు శ్రీకాంత్‌ తెలిపాడు. ప్రశాంత్ తిరిగి వచ్చేందుకు నాలుగేళ్లుగా పోలీసుల కృషి ఎంతో ఉందని గుర్తుచేశాడు. ప్రశాంత్ తిరిగి వచ్చేందుకు మీడియా పాత్ర కూడా ఎంతో ఉందని తెలిపాడు.

Tags:    

Similar News