Pranab Mukherjee Still On Ventilator : వెంటిలేటర్ ‌పైనే ప్రణబ్‌!

Pranab Mukherjee Still On Ventilator : దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌ ముఖర్జీ ఆరోగ్యం పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని రాజధానిలోని ఆర్మీ రీసెర్చ్

Update: 2020-08-15 11:02 GMT
Pranab Mukherjee (File Photo)

Pranab Mukherjee Still On Ventilator : దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌ ముఖర్జీ ఆరోగ్యం పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని రాజధానిలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ శనివారం తెలిపింది. ప్రణబ్ ముఖర్జీ ఇంకా మెరుగుపడాల్సి ఉంది.. ప్రస్తుతం అయన వెంటిలేటరీ మద్దతుతోనే చికిత్స అందిస్తున్నాం.. ఆయన ప్రాణాధారాలు స్ధిరంగా ఉన్నాయి. నిష్ణాత వైద్య బృందం ఆయనను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది" అని వైద్య నిపుణులు తెలిపారు..

అయితే తన తండ్రి ఆరోగ్య పరిస్థితి చాలా క్లిష్టంగా కొనసాగుతున్నప్పటికీ, అది మరింతగా దిగజారలేదని ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిస్తా ముఖర్జీ నిన్న వెల్లడించారు.. అటు సోషల్‌ మీడియాలో ప్రణబ్‌ మృతి చెందారని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.. 84 ఏళ్ల ప్రణబ్‌ ముఖర్జీ త్యవసర శస్త్రచికిత్స నిమిత్తం ఢిల్లీ కాంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చేసిన పరీక్షల్లో ఆయనకి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది..

ఇక అయన ఆరోగ్య పరిస్థితి పైన కేంద్ర మంత్రులు, ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ కి ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు. అయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్దిస్తున్నారు.. ఇక అటు ప్రణబ్ ముఖర్జీ స్వగ్రామంలో మహామృత్యుంజయ యజ్ఞాన్ని నిర్వహించి ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు గ్రామస్తులు. 

Tags:    

Similar News