Pranab Mukhergee: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన డీప్ కోమాలో ఉన్నారు. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ డాక్టర్లు తాజాగా హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. నిన్నటికీ ఇవాళ్టికీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు తెలిపారు. ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల ప్రణబ్ ముఖర్జీ సెప్టిక్ షాక్‌లో ఉన్నారని వివరించారు. డీప్ కోమాలో ఉన్న ప్రణబ్ ముఖర్జీకి వెంటిలేటర్ సపోర్ట్ ద్వారా ట్రీట్‌మెంట్ అందిస్తున్నాం అని డాక్టర్ల బృందం తెలిపింది. ప్రణబ్ ముఖర్జీ (84) ఆగస్టు 10న ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆక్కడ మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించిన అనంతరం. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అంతేకాకుండా ఆయనకు కొవిడ్-19 సోకింది.