ఏడురోజులు భారతదేశం అంతటా సంతాప దినాలు
ప్రణబ్ ముఖర్జీ పార్ధివదేహాన్ని ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్ వద్ద ఉన్న ఆయన నివాసానికి తరలించారు. కరోనావైరస్ మార్గదర్శకాలను అనుసరించి..
ప్రణబ్ ముఖర్జీ పార్ధివదేహాన్ని ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్ వద్ద ఉన్న ఆయన నివాసానికి తరలించారు. కరోనావైరస్ మార్గదర్శకాలను అనుసరించి, దాదా మృతదేహాన్ని అధికారిక నివాసంలో ఉంచారు, అక్కడ కొంతమంది ప్రజలకు మాత్రమే చివరి నివాళులర్పించడానికి అనుమతించారు. ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలోని లోథి ఎస్టేట్‌లో జరగనున్నాయి. కరోనావైరస్ ప్రోటోకాల్స్ ను అనుసరించి జరుగుతాయి.
ఇదిలావుండగా, దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం తరువాత ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6 వరకు రెండు రోజులు కలుపుకొని భారతదేశం అంతటా ఏడు రోజులు రాష్ట్ర సంతాపం పాటించనున్నట్లు హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ సహా అన్ని కార్యాలయాలపై జాతీయ జెండాను అవనతం చేయనున్నారు.
కాగా నెల రోజులుగా కోమాలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రణబ్ మృతి దేశానికి తీరని లోటని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రణబ్ మృతిపట్ల కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠకు లేఖ రాశారు. అందులో ఐదు దశాబ్దాల పాటు ప్రణబ్ కాంగ్రెస్‌తో విడదీయరాని భాగం అయ్యారని పేర్కొన్నారు.