కర్ణాటక సెక్స్ స్కాండెల్ కేసులో కీలక పరిణామం.. తొలిసారి కేసుపై స్పందించిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ
మాజీ ప్రధాని దేవెగౌడ హెచ్చరికతో సెల్ఫీ వీడియో రిలీజ్
కర్ణాటక లైంగిక దౌర్జన్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసుపై ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎట్టకేలకు స్పందించారు. గత నెల 29న ప్రజ్వల్ రేవణ్ణ పై లైంగిక దౌర్జన్యం కేసు నమోదు కాగా నాటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఏప్రిల్ 30న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై పార్టీ సస్పెన్షన్ వేటు సైతం వేసింది. విచారణకు సహకరిస్తామని కుమార స్వామి తెలిపారు. నాటి నుంచి ప్రజ్వల్ రేవణ్ణ పరారీలో ఉండటంతో మాజీ ప్రధాని ప్రధాని దేవెగౌడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సహనాన్ని పరీక్షించవద్దని వెంటనే లొంగిపోవాలని ప్రజ్వల్ రేవణ్ణ ను దేవెగౌడ్ హెచ్చరించాడు. దీంతో తాజాగా ఓ వీడియోను ప్రజ్వల్ రేవణ్ణ విడుదల చేశారు. ఎలాంటి ఆధారాలు లేని అభియోగాలను తనపై మోపుతున్నారని ఆరోపించారు. ఇక మే 31న ప్రజ్వల్ రేవణ్ణ సిట్ అధికారుల ముందు హాజరుకానున్నట్లు సమాచారం.