Pragya Thakur Comments on Corona: హనుమాన్ చాలీసా పఠిస్తే.. కరోనా ఖతం: బీజేపీ ఎంపీ ప్రజ్ఙాసింగ్
Pragya Thakur Comments on Corona: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Pragya Thakur Comments on Corona: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాఉంటే.. కొందరు రాజకీయ నేతలు మాత్రం సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. కరోనా వైరస్ దరిచేరకుండా ఉండటానికి భాభీజీ అప్పడాలను రోజూ తినాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రెండురోజుల కిందటే సూచించారు. అప్పడాలను తయారు చేయడానికి వినియోగించిన మసాలాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యల దుమారం తగ్గకముందే బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత, భోపాల్ లోక్‌సభ సభ్యురాలు ప్రజ్ఙాసింగ్ ఠాకూర్ మరో సలహా చెప్పారు. హనుమాన్ చాలీసాను పఠిస్తే ప్రపంచం కరోనాను జయించవచ్చని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ సూచించారు. హనుమాన్ చాలీసాను ప్రతి రోజూ 5 సార్లు, ఆగస్టు 5 వరకూ పారాయణం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాతో పోరాటం సాగించడానికి ప్రజలందరూ వచ్చె నెల అయిదు వరకు రోజుకు అయిదుసార్లు హనుమాన్ చాలీసా చదవాలని చెప్పిన ఆమె చివరి రోజు ఇంట్లో దీపాలు వెలిగించి శ్రీరాముడికి హారతి ఇవ్వాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు హనుమాన్ చాలీసాను ఒకే స్వరంలో గానం చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందంటున్నారు ప్రజ్ఞా ఠాకూర్. అలా చేస్తే కరోనా నుంచి విముక్తి పొందుతామంటున్నారు.
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. కరోనా వైరస్ బారి నుంచి విముక్తిని పొందబోతున్నామని అన్నారు. మంచిరోజులు వచ్చాయనీ చెప్పారు. ఆగస్టు 5వ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామచంద్రుడి ఆలయ నిర్మాణానికి నిర్వహించే భూమిపూజతో అన్ని కష్టాలు తీరబోతున్నాయని చెప్పారు. కరోనా వైరస్ బారిన పడిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ త్వరలోనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
आइए हम सब मिलकर कोरोना महामारी को समाप्त करने के लिए लोगों के अच्छे स्वास्थ्य की कामना के लिए एक आध्यात्मिक प्रयास करें आज25 से 5 अगस्त तक प्रतिदिन शाम 7:00 बजे अपने घरों में हनुमान चालीसा का 5 बार पाठकरें5 अगस्त को अनुष्ठान का रामलला की आरती के साथ घरों में दीप जलाकर समापन करें pic.twitter.com/Ba0J2KrkA8
— Sadhvi Pragya singh thakur (@SadhviPragya_MP) July 25, 2020