Pregnant woman traveled across river for hospital: కష్టపడి నది దాటిస్తే చివరికి విషాదమే మిగిలింది
ఓ నిండు గర్భిణినికి పురిటినొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్న
Pregnant woman travelledl across river for hospital :ఓ నిండు గర్భిణినికి పురిటినొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్న నది కావడంతో గత్యంతరం లేకా ఓ ఇంటిపాత్రను ఎంచుకున్నారు ఆమె ఇంటి పెద్దలు.. అందులో ఆమెను కూర్చుబెట్టుకొని నది దాటించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇన్ని కష్టాలు పడి ఆమెని ఆసుపత్రికి తీసుకువెళ్తే చివరికి విషాదమే మిగిలింది. ఆ గర్భిణి మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషాదకరమైన ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గొర్ల గ్రామంలో చోటు చేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గొర్ల గ్రామానికి చెందిన గర్భిణికి జులై 14న నొప్పులు వచ్చాయి. అదే సమయంలో భారీ వర్షాలు కురిసి వరదలు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఆమెను ఆస్పత్రికి తరలించాలంటే నదిని దాటి 15 కిలోమీటర్ల దాటాల్సిన పరిస్థితి.. చేసేదీ ఏమీ లేకా ఆ గర్భిణినిని ఆమె కుటుంబ సభ్యులు ఒక పెద్ద పాత్రలో ఆమెను కూర్చోబెట్టి కర్రల సహాయంతో మెల్లిగా నదిని దాటించారు.
చివరికి ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే వైద్యులు మాత్రం అప్పటికి మా సమయం అయిపోయిందని వెళ్ళిపోయారు. తరవాత షిఫ్ట్ కి రావాల్సిన డాక్టర్లు రావడం ఆలస్యం కావడంతో ఆమెకి నొప్పులు ఎక్కువయ్యాయి. దీనితో ఆ గర్భిణి మృత శిశువుకు జన్మనిచ్చింది. దీనితో ఆమె కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం వలెనే ఇలా జరిగిందని ఆరోపించారు. ఈ ఘటన పైన స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం విచారణ చేపట్టింది.