LPG Subsidy: కేంద్రం గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పెంపు.. ఎంతంటే?
Modi Govt Cabinet Decison: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
Modi Govt Cabinet Decison: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీని పెంచింది. ప్రస్తుతం ఉన్న రూ.200 రాయితీని రూ.300 చేసింది. కేబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి మీడియాకు కేటినెట్ నిర్ణయాలను వెల్లడించారు. ‘ఉజ్వల’ గ్యాస్ సిలిండర్ రాయితీని రూ.300 పెంచాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. అలాగే తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.