Post Office: మీ డబ్బులు భద్రంగా ఉండాలంటే ఈ 4 స్కీంలు బెటర్..! అవేంటంటే..?
Post Office: ఒకప్పుడు ఉత్తరాలకే పరిమితమైన పోస్టల్ శాఖలో రకరకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి.
Post Office: ప్రస్తుతం పోస్టాఫీసుల్లో రకరకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఉత్తరాలకే పరిమితమైన పోస్టల్ శాఖ తాజాగా బ్యాంకుల మాదిరిగానే ఎన్నో స్కీమ్స్‌ను ప్రవేశపెడుతోంది. పోస్టాఫీసులలో డబ్బులు పెట్టడం ద్వారా మంచి రాబడి పొందవచ్చు. ఇంకో విషయం ఏంటంటే డిపాజిట్ మొత్తం, మెచ్యూరిటీపై పన్ను మినహాయింపు ఉంటుంది. పిల్లలు, యువకులు, వృద్ధులు ఎవరైనా సరే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ పథకంలో చేరవచ్చు.
1. సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన పథకంలో పోస్టాఫీస్ అత్యధిక వడ్డీ రేటు 7.60 శాతం చెల్లిస్తుంది. ఇందులో సంవత్సరంలో కనీసం 250 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఇంతకు ముందు కనీస మొత్తం రూ .1000 ఉండేది కానీ ప్రభుత్వం దీనిన రూ.250 కి తగ్గించింది. ఒక నెల లేదా సంవత్సరంలో మీరు ఎన్ని సార్లయినా డిపాజిట్ చేయవచ్చు. అయితే ఒక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో ఒక ఆడపిల్ల పేరు మీద ఒక ఖాతా మాత్రమే ఉంటుంది. కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల ఖాతాలు తెరవవచ్చు. కూతురు వయస్సు 10 సంవత్సరాల కంటే ముందే ఈ ఖాతా తెరవాలి. ఆదాయపు పన్ను సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
2. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ ఖాతా
రెండో స్కీం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ అకౌంట్ లేదా SCSA. దీనిలో 7.40 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందులో మీరు కనీసం రూ.1,000 గరిష్టంగా రూ.15 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఈ పాలసీ కాలపరిమితి 5 సంవత్సరాలు. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయోపరిమితి 60 సంవత్సరాలు. ఈ పథకంలో కూడా పన్ను మినహాయింపు ప్రయోజనం సెక్షన్ 80 సి కింద లభిస్తుంది.
3. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మూడో స్థానంలో ఉంది. ఇందులో 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందులో, కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి గరిష్టంగా రూ .1.5 లక్షలు ఒక సంవత్సరంలో డిపాజిట్ చేయవచ్చు. ఇది 15 సంవత్సరాల కాలపరిమితి కలిగి ఉంటుంది. దీని మొత్తం రిటర్న్ పన్ను రహితంగా ఉంటుంది.
4. కిసాన్ వికాస్ పాత్ర
కిసాన్ వికాస్ పాత్ర నాలుగో స్థానంలో ఉంది. ఇందులో 6.90 శాతం వడ్డీ లభిస్తుంది. కనీస డిపాజిట్ పరిమితి రూ.1000 గరిష్టం పరిమితి లేదు. కిసాన్ వికాస్ పత్ర (KVP) 2.5 సంవత్సరాల తర్వాత క్యాష్ చేయవచ్చు దీనిపై పన్ను మినహాయింపుకు ఆస్కారం లేదు.