G-20 Delegation: విదేశీ ప్రముఖలతో సందడిగా మారిన పోర్టు బ్లెయిర్

* అండమాన్ నికోబార్ దీవుల్లో సెల్యులార్ జైలును సందర్శించిన ప్రముఖులు

Update: 2022-11-26 01:00 GMT

విదేశీ ప్రముఖలతో సందడిగా మారిన పోర్టు బ్లెయిర్

G-20 Delegation: సుందర మనోహరమై అండమాన్, నికోబార్ దీవుల వేదికగా ప్రపంచదేశాల ప్రతినిధులతో జీ20 సమావేశాలు జరుగనున్నాయి. పోర్టుబ్లెయిర్ ఎయిర్‌పోర్టుకు పొరుగుదేశాలనుంచి ప్రముఖులు చేరుకున్నారు. విమానాశ్రయంలో సాంప్రదాయ నృత్యాలతో విదేశీ ప్రముఖులకు రెడ్ కార్పెట్ పరచి ఆహ్వానించారు. గిరిజన సాంప్రదాయ నృత్యరీతులు అతిథులను మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఎయిర్ పోర్టునుంచి వెలుపలికి రాగానే సముద్ర తీరం, పచ్చని కొబ్బరి చెట్లు, దివ్యానుభూతిని కలిగించే అహ్లాదకర వాతావరణం, పచ్చని ప్రకృతి ప్రపంచదేశాల ప్రతినిధులను కట్టిపడేశాయి. చార్టెడ్ విమానాల్లో చేరుకున్న ప్రతినిధులను సమావేశాలు జరిగే స్వరాజ్ ద్వీప్‌కు రెండున్నర గంటలపాటు సముద్రయానం చేశారు. జీ20 సమావేశాలకు హాజరైన ప్రతినిధులు అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలును సందర్శించారు. జీ20 సమావేశాలతో అండమాన్ నికోబార్ దీవులు ప్రపంచ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు వస్తుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News