Lok Sabha Election 2024: 39 లోక్ సభ స్థానాలకు 102 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్

Lok Sabha Election 2024: మొత్తం 102 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్

Update: 2024-04-19 02:21 GMT

Lok Sabha Election 2024: 39 లోక్ సభ స్థానాలకు 102 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ 

Lok Sabha Election 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. ఇవాళ తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, తమిళనాడు, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, ఉత్తరప్రదేశ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరాఖండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ తో పాటు.. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలో పోలింగ్ నిర్వహించనున్నారు. తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ స్థానాలకు తొలి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి.

ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగనున్నది. ఎన్నికలు సజావగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంది. ఓటింగ్ కేంద్రాల వద్ద భారీగా కేంద్ర బలగాలను మొహరింప చేసింది. కొండ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం ఐదు గంటలకే పోలింగ్ ముగియనున్నది.

తొలిదశ పోలింగ్ లో ఒక వెయ్యి 625 మంది అభ్యర్దులు పోటీలో నిలిచారు. వారిలో ఒక వెయ్యి 491 మంది పురుషులు కాగా 134 మంది మహిళలు ఉన్నారు. ఇక 16.63 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 8.4 మంది పురుషులు, 8.23 కోట్ల మంది మహిళలు ఉన్నారు. కాగా 35.67 లక్షల మంది తొలిసారి తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు ఈసీ వెల్లడించింది. మొత్తం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వికలాంగుల కోసం ప్రత్యేకంగా వెయ్యి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 18 లక్షల మంది సిబ్బంది తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. పోలింగ్ ఎన్నికల నిర్వహాణ కోసం 41 హెలికాప్టర్లు, 8 ప్రత్యేక రైళ్లు, సుమారు లక్ష వాహనాలు వినియోగిస్తున్నట్టు ఈసీ తెలిపింది.

ఎన్నికల పోలింగ్ కోసం 361 మంది పరిశీలకులను నియమించారు. వీరిలో 127 మంది సాదారణ పరిశీలకులు, 67 మంది పోలీసు పరిశీలకులు, 167 మంది వ్యయ పరిశీలకును నియమించినట్టు ఈసీ తెలిపింది. ఇక 4 వేల 627 ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 5, 208 స్టాటిస్టిక్స్ సర్వై లైన్స్ టీములు, రెండు వేల 28 వీడియో సర్వైలేన్స్ టీంలు, ఒక వెయ్యి 255 వీడియో వ్యూయింగ్ టీంలను ఏర్పాటు చేసినట్టు ఈసీ వివరించింది.

Tags:    

Similar News