పశ్చిమ బెంగాల్‌లో హీటెక్కిన రాజకీయాలు
* అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యుహాలు * మరోసారి అధికారం కోసం మమత ఎత్తులు * రాష్ట్రవ్యాప్తంగా మా కిచెన్ పథకానికి శ్రీకారం
అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు హీటెక్కాయి. బెంగాల్‌లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. మరోసారి అధికారం కోసం మమత కొత్త పథకాలను జనంలోకి తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా మరో కొత్త పథకానికి శ్రీకారం చూట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా మా కిచెన్ సెంటర్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. 5 రూపాయలకే ప్రజలకు భోజనం అందించేందుకు ఈ పథకం ప్రారంభించారు. పేదల ప్రజలంరికీ కడుపునిండా భోజనం పెట్టడేమ లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్టు ప్రకటించారు.
ప్రస్తుతం బెంగాల్‌లోని నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో మా కిచెన్‌లు ప్రారంభించామని సీఎం మమతా వెల్లడించారు. త్వరలోనే మరిన్ని సెంటర్లు పెంచాతమన్నారు. లబ్దిదారులు కేవలం 5 రూపాయలతోనే భోజనం చేయవచ్చన్నారు. అన్నం, పప్పు, కూరగాయలు, గుడ్డు కూర 5కే అందివ్వనున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 1 నుంచి 3గంటల వరకు స్వయం సహాయక బృందాలు వంటశాలలను నిర్వహిస్తాయని తెలిపారు.