Night curfew: లాక్ డౌన్ ఉండదు.. నైట్ కర్ఫ్యూ ప్రత్యామ్నాయం- ప్రధాని మోడీ

Night curfew: కరోనా కట్టడిపై ముఖ్యమంత్రులతో చర్చించిన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2021-04-08 15:39 GMT

Night curfew: లాక్ డౌన్ ఉండదు.. నైట్ కర్ఫ్యూ ప్రత్యామ్నాయం- ప్రధాని మోడీ

Night curfew: కరోనా కట్టడిపై ముఖ్యమంత్రులతో చర్చించిన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మళ్లీ లాక్‌డౌన్ ఉండే ప్రసక్తే లేదని మోడీ తేల్చి చెప్పారు. అయితే దేశంలో కరోనా పరిస్థితి సీరియస్‌గా ఉందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయన్న ప్రధాని రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రాష్ట్రంలో కోవిడ్ టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని ప్రధాని సూచించారు. పెరుగుతున్న కేసులను చూసి భయపడొద్దన్న ప్రధాని కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూను ప్రత్యామ్యాయంగా వెల్లడించారు.

Tags:    

Similar News