పరిస్థితులు దిగజారకుండా రాష్ట్రాలు జాగ్రత్త పడాలి : ప్రధాని మోడీ
Narendra Modi: పండుగ సమయాల్లో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ ఆదేశించారు.
Narendra Modi: పండుగ సమయాల్లో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ ఆదేశించారు. కరోనా కట్టడికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలని సూచించారు. జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్‌ను ముందస్తుగానే సమకూర్చుకోవాలని ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులకు సూచించారు.
ప్రతి ఒక్కరూ కరోనా రూల్స్ పాటించేలా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ప్రధాని మోడీ సూచించారు. అలాగే అందరు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేసుకునేలా చైతన్యం తీసుకురావాలన్నారు. వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధమన్నారు. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభించి ఏడాది పూర్తవుతుందని ప్రధాని మోడీ గుర్తుచేశారు. దేశంలో ఫస్ట్ డోస్ 90 శాతం పూర్తవ్వగా రెండో డోస్ వ్యాక్సినేషన్ 70శాతం పూర్తయ్యిందని ప్రధాని మోడీ వెల్లడించారు. మరోవైపు టీనేజర్లకు సైతం పదిరోజులుగా వ్యాక్సినేషన్ వేస్తున్నట్లు మోడీ వివరించారు. ఇప్పటి వరకు 3కోట్ల టీనేజర్లకు వ్యాక్సిన్ వేసినట్లు మోడీ తెలిపారు.