PM Modi: రేపు బ్రిటన్ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ

PM Modi: షెడ్యూల్ ప్రకారం బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్సన్ భార‌త ప‌ర్య‌ట‌న‌కు రావాల్సి ఉంది.

Update: 2021-05-03 02:51 GMT

 నరేంద్ర మోడీ ఫైల్ ఫోటో 

PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌తో రేపు స‌మావేశం కానున్నారు. వర్చువల్ సదస్సులో వీరిద్ద‌రు భేటీ కాబోతున్నారు. రేపటి(మంగ‌ళ‌వారం) జ‌రిగే ఈ సమావేశంలో రెండు దేశాలకూ సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో బ్రిట‌న్ తో సంబంధాలు మెరుగైయ్యాయి. 2004 నుంచి బ్రిటన్‌తో ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉంది.

షెడ్యూల్ ప్రకారం బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్సన్ భార‌త ప‌ర్య‌ట‌న‌కు రావాల్సి ఉంది. ఇండియాలో కరోనా ఎక్కువగా ఉండటంతో... ఈ పర్యటన రద్దైంది. ఇప్పుడు ప్రపంచ దేశాల మద్దతుతో మళ్లీ కోరుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆయా దేశాల్లో కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు భార‌త్ స‌హాయం చేసిన విష‌యం తెలిసిందే. ప్రధానంగా 5 అంశాలపై ఈ రోడ్ మ్యాప్ ఉంటుంది. ప్రజల మధ్య సంబంధాలు, వ్యాపారం అభివృద్ధి, రక్షణ భద్రత, వాతావరణ మార్పులు, ఆరోగ్యం. ఈ కరోనా అంశంపై ఆరోగ్యంలో భాగంగా చర్చిస్తారు.

కరోనా విషయంలో అమెరికా కంటే ముందుగా బ్రిటన్ సాయం చేసేందుకు ముందుకొచ్చింది. దాంతో ఆ దేశంతో సంబంధాలు పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత ముందుకొచ్చింది. రేపటి సదస్సులో ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో రెండు దేశాలూ సహకారం ఇచ్చిపుచ్చుకునేలా నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా కరోనాను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై నేతలు ఎక్కువగా చర్చించనున్నారు. 2030 నాటికి సమగ్ర రోడ్‌మ్యాప్‌ను ఈ సదస్సులో ప్రారంభిస్తారు.

Tags:    

Similar News