PM Modi Ayodhya Tour: ప్రధాని మోదీ అయోధ్య పర్యటన ఖరారు
PM Modi Ayodhya Tour: భారతదేశంలోని కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్యలో రామాలయం నిర్మాణం త్వరలో జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ నిర్మానికి శంకుస్థాపన చేయనున్నారు.
PM Modi Ayodhya Tour: భారతదేశంలోని కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్యలో రామాలయం నిర్మాణం త్వరలో జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ నిర్మానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య పర్యటన ఖరారు అయింది. ఆగస్ట్ 5న ఉదయం అయోధ్యలో జరిగే రామాలయం నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారని సోమవారం ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి ఆగస్టు 5న మధ్యాహ్నం 12.15 గంటలకు పునాది రాయి వేయాలని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి భూమిపూజకు రావాల్సిందిగా ట్రస్ట్ సభ్యులు కోరారు.
ప్రధానితో పాటు అయోధ్య ఉద్యమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా మరో 250 మంది అతిథులు కూడా హాజరుకాన్నారు. కేంద్ర మంత్రులను, ఉత్తర ప్రదేశ్ మంత్రులతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందు పరిషత్ సీనియర్ ప్రతినిధులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే రామాలయ నిర్మాణం భూమిపూజలో పాల్గొంటారు. ఇదిలావుంటే రామాలయం ఎత్తు మరింత పెరగనుంది. 161 అడుగుల ఎత్తున దీనిని నిర్మించాలని నిర్ణయించినట్లు ఆలయ శిల్పి నిఖిల్ సోమ్‌పుర వెల్లడించారు. ఈయన ఆలయ ప్రధాన శిల్పి చంద్రకాంత్ సోమ్‌పుర కుమారుడు.