భారత్ చేరుకున్న ప్రధాని మోడీ.. ఐదు రోజుల విదేశీ పర్యటనలో...
Narendra Modi - Foreign Tour: జీ-20, గ్లాస్కో కాప్-26 సదస్సుల్లో పాల్గొన్న ప్రధాని...
Narendra Modi - Foreign Tour: ఐదు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ భారత్ చేరుకున్నారు. ఇటలీ, యూకే పర్యటన ముగించుకొని ఢిల్లీకి వచ్చారు. పర్యటనలో భాగంగా.. జీ-20, కాప్-26 ప్రపంచ వాతావరణ సదస్సుల్లో పాల్గొన్నారు. ఇటలీ పర్యటనలో భాగంగా వాటికన్ సిటీని సైతం మోదీ సందర్శించారు. క్యాథలిక్ చర్చిల అధినేత పోప్ ప్రావిన్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా భారత్‌కు రావాలని పోప్‌ను మోదీ ఆహ్వానించారు.
గ్లాస్గోలో జరిగిన కాప్ 26 సదస్సులో మోడీ... "ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్" ని ప్రారంభించారు. స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, నేపాల్, మలావి, ఉక్రెయిన్, జపాన్ నాయకులతో మోడీ మాట్లాడారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ను కలిశారు. వాతావరణ మార్పులపై చర్చించారు. పారిస్ ఒప్పందం ప్రకారం వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారత దేశం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోందన్నారు మోడీ.