Narendra Modi - Kedarnath Tour: కేదార్‌నాథ్‌లో ప్రధాని మోడీ పర్యటన
Narendra Modi - Kedarnath Tour: పునర్నిర్మించిన శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని ప్రారంభించినున్న మోడీ...
Narendra Modi - Kedarnath Tour: ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తున్నారు. కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన మోడీ.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అక్కడ పునర్‌నిర్మించిన శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత ఆదిశంకరాచార్యుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
కేదార్‌నాథ్‌లోని ఆదిశంకరాచార్యుడి సమాధి.. 2013లో వచ్చిన భారీ వరదల వల్ల ధ్వంసమైంది. అటు డెహ్రాడన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి ఉత్తరాఖండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గుర్మిత్ సింగ్, సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘన స్వాగతం పలికారు.
దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చెక్కుచెదరకుండా ఉండేందుకు, ప్రధాని కేదర్‌నాథ్ యాత్రలో భాగంగా ఆది శంకరాచార్యులను స్మరించుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. శంకరాచార్యుల అఖండ యాత్రలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన 87 మంచ్‌దార్లలో సాధువులు, మహామండలేశ్వరులు, నిర్వహకులు పాల్గొంటున్నారు.
ఇలాంటి కార్యక్రమాలతో ఆధ్యాత్మిక చైతన్యానికి కొత్త నిర్వచనాన్ని తెలపనున్నట్టు పేర్కొన్నారు. ఆదిశంకరాచార్యలు చేపట్టిన అద్భుతాల గురించి ప్రజలకు వివరించనున్నారు.
ఇటీవల ఉత్తరాఖండ్‌లో 130 కోట్ల రూపాయల ఖర్చుతో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఈ ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. అదేవిధంగా ఒక బహిరంగసభలో ప్రసంగించనున్నారు.
మరో 180కోట్ల అంచనా వ్యవయంతో నిర్మించతలపెట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.