రెండ్రోజుల పాటు గుజరాత్‌లో ప్రధాని పర్యటన.. నాలుగు లక్షల మందితో భారీ రోడ్ షో
Narendra Modi - Gujarat Tour: మోదీకి భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు...
Narendra Modi - Gujarat Tour: నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం తరువాత రెండ్రోజుల పర్యటనకు గుజరాత్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. మోదీ రాకను పురస్కరించుకుని భారీ రోడ్ షో నిర్వహించేందుకు గుజరాత్ బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. నాలుగు రాష్ట్రాల విజయానికి ప్రతీకగా ప్రధానికి గౌరవ వందనం సమర్పించాలని పార్టీ నేతలు ఏర్పాట్లు సిద్ధం చేశారు.
ఇవాళ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న మోదీ.. అక్కడి నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా నిర్వహించే రోడ్ షోలో 4 లక్షల మంది పాల్గొననున్నట్టు సమాచారం. పార్టీ కార్యాలయానికి చేరకున్న అనంతరం ఎమ్మెల్యేలు, ఎంపీలతో మోదీ సమావేశం కానున్నారు. ఈ ఏడాది చివర జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ప్రధాని దిశా నిర్దేశం చేయనున్నారు. అనంతరం జీఎండీసీ గ్రౌండ్‌లో నిర్వహించే మారు గ్రామ్ మారు గుజరాత్ కార్యక్రమంలో పాల్గొన్ననున్నారు.