PM Narendra Modi: లాక్ డౌన్ చివరి అస్త్రంగా మాత్రమే వాడాలి

PM Narendra Modi: కరోనా సెకండ్ వేవ్‌ తుఫాన్‌లా దూసుకొస్తుందని ప్రధాని మోడీ అన్నారు.

Update: 2021-04-20 15:43 GMT

PM Narendra Modi: కరోనా సెకండ్ వేవ్‌ తుఫాన్‌లా దూసుకొస్తుందని ప్రధాని మోడీ అన్నారు. కరోనా పై మరోసారి యుద్ధం చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దేశంలో ఆక్సిజన్ కొరత ఉందని ఆక్సిజన్ కోరత తీర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు. డిమాండ్ తగ్గ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. దేశ ప్రజలు ధైర్యాన్ని కోల్పోవద్దని కోరారు.

ఫాస్ట్ ట్రాక్‌ పద్దతిలో వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చామన్నారు ప్రధాని మోడీ. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మే 1 నుంచి వ్యాక్సిన్ అందిస్తామన్నారు. కరోనా వారియర్స్ మనల్ని కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని మోడీ అన్నారు. మనదేశంలో అవసరానికి సరిపడ ఫార్మా సెక్టర్ ఉందన్నారు. అతి తక్కువ సమయంలోనే కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసుకున్నామన్నారు.

లాక్‌డౌన్‌లు చివరి ఆస్త్రంగా మాత్రమే వాడుకోవాలని ప్రధాని రాష్ట్రాలకు తెలిపారు. మైక్రో కంటైన్మెంట్ జోన్‌లను ఏర్పాటు చేసుకోవడంతోనే కరోనా కట్టడి చేసుకోవచ్చు మనకు లాక్‌డౌన్ విధించుకునే అవకాశం రాకూడద్దన్నారు. దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడుకోవాలని సూచించారు. యువకులు గ్రూపులుగా ఏర్పాడి కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Tags:    

Similar News