పీఎం భద్రతా వైఫల్యంపై పంజాబ్ ప్రభుత్వం మరో యాక్షన్
PM Modi`s Security Lapse: ప్రధాని భద్రతా వైఫల్యంపై పంజాబ్ ప్రభుత్వం ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీని బదిలీ చేసింది.
PM Modi`s Security Lapse: ప్రధాని భద్రతా వైఫల్యంపై పంజాబ్ ప్రభుత్వం ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీని బదిలీ చేసింది. ఈ నెల 5న జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తున్నాయి. స్వతంత్ర దర్యాప్తు కమిటీపై సోమవారం నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ క్రమంలోనే పంజాబ్ ప్రభుత్వం ఫిరోజ్ పూర్ ఎస్ఎస్పీ హర్మన్‌దీప్ సింగ్ హన్స్‌ను బదిలీ చేసింది. హర్మన్‌ను లూధియానాలోని థర్డ్ ఐఆర్బీకి కమాండెంట్‌గా నియమించింది. ఆయన స్థానంలో ఫిరోజ్ పూర్ ఎస్ఎస్పీగా నరీందర్ భార్గవ్‌ను నియమించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ డీజీపీ సహా 9మంది అధికారులను బదిలీ చేసింది చరణ్‌జీత్ సర్కార్.